Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001127
            [news_title_telugu_html] => 

ఎస్సై హత్య:పూలతో నిందితులకు స్వాగతం

[news_title_telugu] => ఎస్సై హత్య:పూలతో నిందితులకు స్వాగతం [news_title_english] => Six Bailed Accused in SI Murder Case Got Grand Welcome in Bulandshahr [news_short_description] => ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గతేడాది జరిగిన ఎస్సై హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితులకు స్థానిక నాయకులు పూల మాలలు వేసి మరీ ఘన స్వాగతం పలికారు. గత డిసెంబరులో జరిగిన బులంద్‌షహర్‌ ఉద్రిక్తత కేసులో అల్లరి మూక చేతిలో ఎస్సై సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ మరణించిన సంగతి తెలిసిందే. [news_tags_keywords] => Bulandshahr, Subodh Kumar Singh, SI Murder Case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:43:27 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎస్సై హత్య:పూలతో నిందితులకు స్వాగతం - Six Bailed Accused in SI Murder Case Got Grand Welcome in Bulandshahr - EENADU
close

తాజా వార్తలు

ఎస్సై హత్య:పూలతో నిందితులకు స్వాగతం

బులంద్‌షహర్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గతేడాది జరిగిన ఎస్సై హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితులకు స్థానిక నాయకులు పూల మాలలు వేసి మరీ ఘన స్వాగతం పలికారు. గత డిసెంబరులో జరిగిన బులంద్‌షహర్‌ ఉద్రిక్తత కేసులో అల్లరి మూక చేతిలో ఎస్సై సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ మరణించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు కారణమైన వారిగా భావిస్తున్న ఆరుగురు కొద్ది రోజులకే అరెస్టయ్యారు. తాజాగా శనివారం వారికి బెయిల్‌ లభించింది. దీంతో ఓ జాతీయ రాజకీయ పార్టీ యువజన విభాగం స్థానిక నాయకులు నిందితులకు పూల దండలు వేసి, ఊరేగింపుగా తీసుకొచ్చారు.  ఈ తతంగం మొత్తాన్ని స్థానిక జర్నలిస్టులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.
ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ సమీపంలో 25 ఆవులకు సంబంధించిన కళేబరాలు దగ్గర్లోని అటవీ ప్రాంతంలో కనిపించడంతో గోవధ జరిగిందన్న ఆరోపణలపై అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. రెండు మతాలకు చెందిన దాదాపు 400 మంది అల్లరి మూక హింసాత్మక వాతావరణం సృష్టించింది. దీన్ని నియంత్రించేందుకు వెళ్లిన స్థానిక ఎస్సై సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈయనపై దాడి చేసిన వారికి సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 
దీనిపై తక్షణం విచారణ జరిపించాలని ఆదేశిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. ఈ కేసులో సిట్‌ 3,400 పేజీల నివేదికను సమర్పించగా, 38మందిపై 103 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.