Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009719
            [news_title_telugu_html] => 

భారత్‌, చైనా మధ్య మళ్లీ ప్రతిష్టంభన

[news_title_telugu] => భారత్‌, చైనా మధ్య మళ్లీ ప్రతిష్టంభన [news_title_english] => India China troops engage in heated exchange in eastern Ladakh [news_short_description] => సరిహద్దు వివాదం కారణంగా భారత్‌, చైనా మధ్య మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. అయితే ఉన్నతాధికారుల చర్చలతో ఒక రోజులోనే సమస్య సద్దుమణిగినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. [news_tags_keywords] => India , China,Ladakh,Standoff,Army [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 11:16:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భారత్‌, చైనా మధ్య మళ్లీ ప్రతిష్టంభన - India China troops engage in heated exchange in eastern Ladakh - EENADU
close

తాజా వార్తలు

భారత్‌, చైనా మధ్య మళ్లీ ప్రతిష్టంభన

దిల్లీ: సరిహద్దు వివాదం కారణంగా భారత్‌, చైనా మధ్య మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. అయితే ఉన్నతాధికారుల చర్చలతో ఒక రోజులోనే సమస్య సద్దుమణిగినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో భారత జవాన్లు పెట్రోలింగ్‌ చేస్తుండగా చైనా సైనికులు అడ్డుకున్నారు. టిబెట్‌-లద్ధాఖ్‌ భూభాగాల మధ్యలో ఉన్న ఈ సరస్సు మూడోవంతు చైనా అధీనంలోనే ఉంది. అయితే భారత భూభాగంలో ఉన్న సరస్సు వెంబడి జవాన్లు పెట్రోలింగ్‌ చేస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కొంతసేపు ప్రతిష్టంభన నెలకొంది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. దీంతో పరిస్థితి సద్దుమణిగినట్లు ఆర్మీ వర్గాలు గురువారం వెల్లడించాయి. వాస్తవాధీన రేఖపై విభిన్న అవగాహనల కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలిపాయి. 

భారత్‌, చైనా మధ్య లద్ధాఖ్‌ సరిహద్దు అంశంపై ప్రతిష్టంభన నెలకొనడం ఇదే తొలిసారి కాదు. 2017 ఆగస్టులో ఇదే విషయమై రెండు దేశాల జవాన్లు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. 

ఇదే కాకుండా అరుణాచల్‌ ప్రదేశ్ సరిహద్దు అంశంలోనూ రెండు దేశాల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య డోక్లాం వివాదం నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొనగా.. దౌత్యపరమైన చర్యలతో ఆ సమస్య పరిష్కారమైంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.