Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009754
            [news_title_telugu_html] => 

‘ఐశ్వర్య’ ఆస్తులు పెరగడంపై ఈడీ ఆరా!

[news_title_telugu] => ‘ఐశ్వర్య’ ఆస్తులు పెరగడంపై ఈడీ ఆరా! [news_title_english] => ED questions DK Shivakumar Daughter In MoneyLaundering Case [news_short_description] => మనీలాండరింగ్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యను ఈడీ విచారించింది. బెంగళూరులో నివసిస్తున్న ఐశ్వర్యకు మంగళవారం....... [news_tags_keywords] => DK shivakumar,Money Laundering Case,ED [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 15:46:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఐశ్వర్య’ ఆస్తులు పెరగడంపై ఈడీ ఆరా! - ED questions DK Shivakumar Daughter In MoneyLaundering Case - EENADU
close

తాజా వార్తలు

‘ఐశ్వర్య’ ఆస్తులు పెరగడంపై ఈడీ ఆరా!

ఐదేళ్లలో రూ.100కోట్లకు ఎలా పెరిగాయని ప్రశ్న

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యను ఈడీ విచారించింది. బెంగళూరులో నివసిస్తున్న ఐశ్వర్యకు మంగళవారం ఈడీ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, 2013లో రూ.కోటిగా ఉన్న ఐశ్వర్య నిర్వహిస్తున్న ట్రస్టు ఆస్తులు  2018 నాటికి రూ.100 కోట్లకు ఎలా పెరిగాయని అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, తండ్రీ కుమార్తె మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు మనీలాండరింగ్‌ సొమ్ముతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారించినట్టు తెలుస్తోంది. అలాగే, 2017లో ఐశ్వర్య తన తండ్రితో కలిసి సింగపూర్‌కు వెళ్లడం.. అక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టడం.. తదితర అంశాలపైనా ఈడీ అధికారులు ఆమెను ఆరా తీస్తున్నట్టు సమాచారం.

మరోవైపు, మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఆయనకు కోర్టు విధించిన ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన్ను కూడా అధికారులు ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. 
ఇటీవల శివకుమార్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు అతని ఆర్థికలావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో ఐశ్వర్య నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలు ఈడీ దృష్టికి వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.