close

తాజా వార్తలు

అమ్మో.. ఆదివారం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాదం పలువురు పర్యాటకుల ప్రాణాలను బలిగొంది. వారాంతపు సెలవుదినం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆదివారం కాస్తా విషాదాదివారంగా మారింది. ఈ ఒక్క ఘటనే కాదు.. గతంలో జరిగిన పడవ బోల్తా ఘటనలూ ఆదివారమే జరగడం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో గతంలో జరిగిన ఘటనలు చూస్తే ఈ విషయం అవగతమవుతోంది.
* విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం 2017 నవంబర్‌ 12న కార్తీక మాసం సందర్భంగా 
నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటులో ప్రయాణిస్తుండగా అది బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు.
* 2018 జులైలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడటంతో 15 మంది మృతి చెందారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.