close

తాజా వార్తలు

ఆ విమానాల్లో సీట్లు ఖాళీగా ఉంచాల్సిందే

న్యూదిల్లీ: దిల్లీ-ఇస్తాంబుల్‌ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు దాదాపు ఐదో వంతు ప్రయాణికుల సంఖ్యను తగ్గించుకోనున్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ మేరకు మార్గదర్శకాలను సూచించింది. ముఖ్యంగా ఇటీవల వాతావరణంలో మార్పుల కారణంగా పడమటి గాలులు బలంగా వీస్తుండటంతో భద్రతా ప్రమాణాల కోసం 15-20శాతం సీట్లను ఖాళీగా వదిలేయాలని ఆ విమానయాన సంస్థకు వెల్లడించింది. 
కొన్నాళ్ల క్రితం ఇదే విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం ఈ మార్గంలో వెళుతూ ప్రయాణికుల సామగ్రిని తీసుకుపోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఈ సూచన చేసింది. ముఖ్యంగా వాతావరణ మార్పులను ఎదుర్కొవాల్సి వచ్చే విమానాలకే ఈ సూచన చేసింది. 
‘‘ ఆ మార్గంలో విమానాలు ఎక్కువ ఇంధనాన్ని వాడుకొంటాయి. అందుకే తక్కువ లోడును  తీసుకెళ్లాలి.’’ అని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.  
విమానాలు 30-60 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రయాణిస్తుండే సమయలో బలమైన గాలులు పడమటి నుంచి తూర్పువైపునకు వీస్తుంటాయి. ప్రస్తుతం ఇండిగో దిల్లీ-ఇస్తాంబుల్‌ మార్గంలో ఎయిర్‌బస్‌-ఏ320, ఏ321  విమానాలను నడుపుతోంది. ఏ320లో 186 మంది, ఏ321లో 222 మంది ప్రయాణించగలరు. ప్రస్తుతం డీజీసీఏ సూచనతో ఇప్పుడు వీరిలో ఐదోవంతు మంది ప్రయాణికులను తగ్గించుకోవాల్సి ఉంటుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.