close

తాజా వార్తలు

చంద్రబాబు ఇల్లు సహా మరో 4 కూల్చివేతే!

ఈనాడు, అమరావతి: కృష్ణానది కుడిగట్టు కరకట్టపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన 5 కట్టడాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు తుది నోటీసులు జారీ చేశారు. వీటిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో సహా మరో 4 ఉన్నాయి. కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 కట్టడాలకు సీఆర్‌డీఏ అధికారులు గతంలో ప్రాథమిక నోటీసులిచ్చారు. తర్వాత వారిని పిలిపించి వాదనలు విన్నారు. 20 కట్టడాలకు సంబంధించిన వారి వాదనలు విని, 5 కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించి తుది నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో ఆ కట్టడాలను వారే కూల్చివేయాలని.. లేకపోతే సీఆర్‌డీఏ చర్యలు తీసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిలో శివస్వామి ఆశ్రమంలో ఉన్న 2 కట్టడాలు, ఆక్వాడెవిల్స్‌ పేరుతో ఉన్న ఒక కట్టడం, మరో 3 అంతస్తుల భవనం ఉన్నాయని అధికారులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.