close

తాజా వార్తలు

మా నాన్నలో దేవుడిని చూశా: యేసుదాసు

హైదరాబాద్‌: తన తండ్రి వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని, ఆయనలో తాను దేవుడిని చూశానని ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసు అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుదాసు మాట్లాడుతూ.. ‘‘నేను చిన్నప్పటి నుంచి సంగీతాన్ని చాలా ఇష్టపడేవాడిని. ‘చదువులు గురించి మర్చిపో.. సంగీతం బాగా నేర్చుకో’ అని మా నాన్న నాకు చెప్పేవారు. ఆయన వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. మా నాన్నలో నేను దేవుడిని చూశా. మా నాన్న ఒక డ్రామా ఆర్టిస్ట్‌, గాయకుడు. అయితే ఆయన సంగీతంలో ఎటువంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కానీ, నాకు మాత్రం సంగీతంలో శిక్షణ ఇప్పించి ఈ స్థాయిలో ఉండేలా చేశారు. నేను విశ్వవిద్యాలయంలో విద్వాన్‌ కోర్సులో శిక్షణ పొందాను. కానీ, ఇప్పటికీ నేను ఓ విద్యార్థినే’’ అని ఆయన పేర్కొన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.