close

తాజా వార్తలు

టయోటా సరికొత్త ‘మిరాయ్‌’ ఆవిష్కరణ

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్లాకు పోటీగా జపాన్‌ కార్ల తయారీ దిగ్గజం టయోటా కూడా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ కారును సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పూర్తిగా సరికొత్త రూపు సంతరించుకొన్న  ది మిరాయ్‌ కాన్సెప్ట్‌ కారును ప్రదర్శించింది. 24న మొదలుకానున్న టోక్యో మోటార్‌ షోకు ముందుగా దీని వివరాలను విడుదల చేసింది. దీనిని విలాసవంతమైన లక్సెస్‌ ‘ఎల్‌ఎస్‌ కుపే’  ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసింది. ఈ కొత్త కారులో హైడ్రోజన్‌ ట్యాంక్‌లను, ఫ్యూయల్‌ సెల్స్‌లో పూర్తి మార్పు చేసినట్లు ప్రకటించింది. 
‘‘మేము ప్రజలు కొనుగోలు చేసే వాహనాన్ని తయారు చేయాలనుకుంటున్నాం. పైగా అది పర్యావరణ హితవుగా ఉండాలి. డ్రైవింగ్‌ ఆనందాన్ని అనుభవించాలి. ఈ కారు అంతకు ముందు మోడల్‌ కంటే ఇది ఖర్చుతక్కువ అవుతుంది.’’ మిరాయ్‌ వాహన చీఫ్ ఇంజినీర్‌ యషికాజు తనాక వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న మిరాయ్‌ పాత మోడల్‌ కారు ధర జపాన్‌లో సబ్సిడీలు పోను 46,500 డాలర్లగా ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.