close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌: తెలంగాణలో దసరా సెలవుల పొడిగింపుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈనెల 19 వరకు అన్ని పాఠశాలలకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెలవులు పొడిగించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా మరో వైపు.. రేపటి నుంచి యథాతథంగా తరగతులు ప్రారంభమవుతాయని పలు కార్పొరేట్‌ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సందేశాలు పంపాయి. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సెలవుల పొడిగింపు వర్తించదని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు ఇప్పటికే వసతి గృహాలకు చేరుకున్నందుకు గురుకుల పాఠశాలల్లో రేపటి నుంచే తరగతులు నిర్వహిస్తామని ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. తరగతులకు హాజరుకాలేని విద్యార్థులపై చర్యలు ఉండవని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా తరగతులు ప్రారంభిస్తామని కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 

ఉత్తర్వులు సవరించిన ప్రవీణ్‌కుమార్‌

దసరా సెలవుల పొడిగింపుపై  జారీ చేసిన ఉత్తర్వులను గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ సవరించుకున్నారు. గురుకుల పాఠశాలలకు ఈనెల 19వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. గురుకుల కాలేజీలకు సెలవుల పొడిగింపు లేదని స్పష్టం చేశారు. గురుకుల కాలేజీల్లోకి ఇప్పటికే 75శాతం విద్యార్థులు వచ్చారని వెల్లడించారు. 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.