close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చర్కీ దాద్రి: ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో అనేక అపోహలు రేకెత్తిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. హరియాణాలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చర్కీ దాద్రి జిల్లాలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ప్రధానంగా జాతీయ భద్రతపై ప్రసంగించారు. ఆర్టికల్‌ 370 రద్దును స్వాగతిస్తూ దేశ ప్రజలందరూ జమ్ము కశ్మీర్‌వైపు నిలిచారని.. కొంత మంది కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ధ్వజమెత్తారు. తనపై ఎన్ని విమర్శలైనా చేయండి కానీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్న భారత్‌ను వెన్నుపోటు పొడవద్దంటూ ప్రధాని మోదీ హితవు పలికారు. ఆర్టికల్‌ 370 రద్దు చేయడం ప్రజాప్రయోజనానికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మళ్లీ తీసుకురాగలిగే ధైర్యం ఉందా? అని మోదీ సవాల్‌ విసిరారు.
పాకిస్థాన్‌కు నీరు ఇచ్చేది లేదు.. 
‘గత 70 ఏళ్లుగా హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల రైతులకు చెందిన నీరు పాకిస్థాన్‌కు పోతోంది. ఇది ఇక్కడితో ఆపేద్దాం. ఇకపై పాకిస్థాన్‌కు నీటిని పంపించే ప్రసక్తే లేదు. ఆ నీటిని మీ ఇళ్లలోకి తీసుకొస్తాను. మోదీ మీ కోసం పోరాడతాడు’ అని మోదీ అన్నారు. రాజస్థాన్‌, హరియాణా రాష్ట్రాల మీదుగా పాకిస్థాన్‌కి వెళ్తున్న నీటిని గత పాలకులు, ప్రభుత్వాలు ఎందుకు అడ్డుకట్టవేయలేదని మోదీ ప్రశ్నించారు. సింధు జలాల ఒప్పందం మేరకు పశ్చిమం వైపు వెళ్లే సింధు, జీలం, చినాబ్‌ నదీజలాలను పాక్‌ వినియోగించుకోవచ్చు. రావి, బియాస్‌, సట్లెజ్‌ నదీ జలాలను భారత్‌ పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే  ఈ నదులకు సంబంధించి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు పాక్‌లోకి వెళుతున్నాయి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.