
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరడానికి టీ10 ఫార్మాట్ దోహదం చేస్తుందని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్ అన్నాడు. ‘ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. దీనిని క్రికెటర్లందరూ ఆస్వాదిస్తారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పోరాడటానికి ప్రతి ఆటగాడు ఇష్టపడతాడు. టీ20 కంటే టీ10 అత్యంత పొట్టిఫార్మాట్. టీ10లో తొలి బంతి నుంచే విధ్వంసం మొదలుపెట్టాలి. ప్రతి బంతి ఎంతో కీలకం. ఫీల్డింగ్ చేస్తున్న జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కానీ, బౌలర్ ఎటువంటి బంతుల్ని సంధిస్తాడో ముందుగానే ఊహించి బౌండరీకి తరలించడానికి బ్యాట్స్‌మెన్ ప్రయత్నించాలి’ అని రసెల్ అన్నాడు.
Tags :