close

తాజా వార్తలు

భారత్‌, చైనాలను అలా పరిగణించొద్దు: ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత్‌, చైనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరారు. ఎందుకంటే ఆ దేశాలు అమెరికాపై సుంకాలు పెంచి ముందుకెళ్తున్నాయని లేఖ రాశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా గుర్తించినప్పటి నుంచి ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని అన్నారు. ‘‘ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నతమైంది. చైనా, భారత్‌లను ఆ సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించి మేం ఆ సంస్థకు లేఖ రాశాం. మేమైతే చైనాను, భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించబోం. ఎందుకంటే ఆ దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచి ఎదుగుతున్నాయి’’ అని విలేకరులతో అన్నారు. 

చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత చైనా వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం ఆర్థికపరమైన ఆంక్షలు విధించినప్పటి నుంచి ఈ యుద్ధం మొదలైంది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. మరోవైపు భారత్‌-అమెరికా త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాయని ఇటీవల సంయుక్తంగా ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ హ్యూస్టన్‌ పర్యటన సందర్భంగా ట్రంప్‌తో ఈ విషయంపై భేటీ అయిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.