close

తాజా వార్తలు

‘అర్జున్‌రెడ్డి’ మరోసారి: అదరగొట్టిన ధ్రువ్‌

ఆదిత్యవర్మ ట్రైలర్‌ విడుదల

చెన్నై: తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’ కథ వెండితెరపై మరోసారి సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమాని ‘కబీర్‌సింగ్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. ఈ సినిమాని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘ఆదిత్య వర్మ’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా మంగళవారం విడుదల చేసింది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. గిరిసాయి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో పనితా చంద్‌ కథానాయికగా తమిళ తెరకు పరిచయం కానున్నారు. ఆదిత్యవర్మ పాత్రలో ధ్రువ్‌, మీరా పాత్రలో పనితా చంద్‌ ఈ సినిమాలో నటించారు. ట్రైలర్‌లో ధ్రువ్‌ నటన చాలా బాగుంది. ‘నాలో నీకు ఏం ఇష్టం’ అని మీరా అడగగా.. ‘నువ్వు శ్వాస తీసుకునే స్టైల్‌ అంటే నాకు ఇష్టం’ అంటూ ధ్రువ్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి.

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.