close

తాజా వార్తలు

ఆ యువతి గోడ పాకడం చూస్తే షాకే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండోనేషియాకు చెందిన ఎరీస్‌ సుసంతి రహయూ అనే యువతి వాల్‌ క్లైంబింగ్‌(గోడ పాకడం) వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కేవలం 7 సెకన్లలోపే ఆమె 15 మీటర్ల గోడను ఇట్టే పాకేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా స్పైడరే పాకుతుందేమో అన్నంత వేగంగా గోడను పాకేసి రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇటీవల చైనాలోని క్సియామెన్‌లో నిర్వహించిన ఐఎఫ్‌ఎస్‌సీ క్లైంబింగ్‌ ప్రపంచకప్‌ మహిళల విభాగంలో ఈ అథ్లెట్‌ సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. 15 మీటర్ల గోడను కేవలం 6.995 సెకన్లలో పాకి వారెవ్వా అనిపించుకుంది. చేతి వేలికి గాయం అయినా కూడా ఆమె 7 సెకన్ల సమయంలోనే రికార్డు నమోదు చేయగలిగింది. రహయూ లక్ష్యాన్ని చేధించిన వేగాన్ని చూసిన నెటిజన్లు ఆమెను స్పైడర్‌ ఉమెన్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే దాదాపు 4.9 మిలియన్లకు పైగా వీక్షించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.