close

తాజా వార్తలు

చకచకా ఒలిచేద్దాం దానిమ్మనిలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: దానిమ్మ పండు ఒలిచేందుకు ఓ వ్యక్తి చేసిన చిట్కా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎందుకంటే ఆ పండు ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు, కానీ ఒలుచుకు తినేందుకు మాత్రం పాట్లు పడుతుంటారు. దీంతో ఓ వ్యక్తి దాన్ని తేలికగా ఒలిచే విధానాన్ని వీడియో తీసి ‘ఇంజినీరింగ్‌ విడ్‌’ అనే ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. చెట్టుకే ఉన్న పండుని కత్తితో కేవలం ఐదారు గాట్లతో ఆరు విభాగాలుగా ఒలిచి తేలికగా తినేలా చేయడమే ఈ వీడియో సారాంశం. అలా అతడు పండు ఒలిచిన విధానం అందరినీ ఆకర్షిస్తుంది. ఆ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే దాదాపు 3 మిలియన్లకు పైగా వీక్షించారు. పలువురు చమత్కారంగా కామెంట్లు చేశారు. ‘ఇన్నాళ్లు ఈ టెక్నిక్‌ తెలియక పండు ఒలిచేందుకు నానా పాట్లు పడ్డానని’ ఒకరు కామెంట్‌ చేయగా, మరొకరు ఇలా ప్రయత్నించి విఫలమై ‘చూడటానికి ఏదైనా తేలికే చేస్తేనే తెలుస్తుంది అందులో ఎంత నైపుణ్యం ఉందో’ అని సరదా కామెంట్లు చేశారు. 

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.