
తాజా వార్తలు
● రైతు భరోసా అందలేదని ‘స్పందన’లో నిలదీసిన రైతులు
● తహసీల్దారును ఓదార్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు
తహసీల్దార్ రామకృష్ణను ఓదారుస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు వెంకట చిరంజీవినాగ్
ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: సాక్షాత్తు ఓ మండల తహసీల్దారు స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్న స్పందన కార్యక్రమంలో కంట తడి పెట్టిన వైనమిది. రైతు భరోసా పథకం తమకు అందకపోవడానికి మీరే కారణమంటూ పలువురు రైతులు ఆయనను నిలదీయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సంఘటన వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఆమదాలవలసలోని పూజారిపేటలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో నియోజవర్గంలోని మండలాల అధికారులు పాల్గొని ఆయా మండలాల ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పొందూరు మండలంలోని కింతలికి చెందిన 70 మంది రైతులు పాల్గొని తమకు రైతు భరోసా అందలేదని మండల తహసీల్దారు టి.రామకృష్ణను నిలదీశారు. ఇలా తిప్పడం వల్లనే రైతులు విసిగి అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో తహసీల్దార్ రామకృష్ణ అక్కడి నుంచి స్పీకర్ తనయుడు వెంకట చిరంజీవినాగ్ వద్దకు వెళ్లి ఈ విషయమై మొరపెట్టుకొని కంటతడి పెట్టారు. దీంతో ఆయన రైతులను తన వద్దకు పిలిపించుకొని అధికారులపై మీరు అలా మాట్లాడరాదని వారిని మందలించారు. స్పీకర్ మీ సమస్యపై ఇదివరకే తహసీల్దార్‌తో మాట్లాడారని, ఆయన పరిష్కరిస్తామని తెలియజేశారని, ఆయన అడిగిన పత్రాలను మీరు తీసుకొని వెళ్లకపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో రైతులు తహసీల్దార్‌కు క్షమాపణ చెప్పడంతో ఆయన శాంతించారు. రైతులు తగిన పత్రాలతో వస్తే తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తహసీల్దారు వారితో తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
