
తాజా వార్తలు
న్యూయార్క్: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌పై పెంచుకున్న ఇష్టం ఓ మహిళ మెడకు యమపాశంగా మారింది. తన భార్య ఓ స్టార్‌ను అంతగా ఆరాధించడం, ఆయన సినిమాలే చూడటం ఇష్టంలేని భర్త అసూయతో భార్యను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన న్యూయార్క్ నగరంలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన దినేశ్వర్ (33) డొజాయ్ (27) అనే మహిళని కొంత కాలం క్రితం వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు న్యూయార్క్‌లోని క్వీన్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. బార్ టెండర్‌గా పనిచేస్తున్న డొజాయ్కు హృతిక్ రోషన్ అంటే ప్రాణం. ఎప్పుడూ హృతిక్ సినిమాలు, పాటలు పెట్టుకుని చూస్తుండేదట. దీంతో దినేశ్వర్ అనేకసార్లు ఆమెపై కోపం తెచ్చుకున్నాడని, గొడవలు జరిగాయని డొజాయ్ స్నేహితురాళ్లు మీడియాకు చెప్పారు. అతడు హృతిక్‌పై అసూయతో ఆమెను కంట్రోల్ చేస్తుండేవాడని, సినిమా చూసేందుకు కూడా ఒప్పుకునేవాడు కాదని తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో హృతిక్ విషయంలో ఏర్పడ్డ గొడవతో దినేశ్వర్, డొజాయ్ని కొట్టి, చిత్ర హింసలకు గురి చేశాడు. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో డొజాయ్ తనను సంరక్షించమని పోలీసులను ఆశ్రయించింది. ఆగస్టు 21న ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల (బుధవారం) క్రితం దినేశ్వర్ కోర్టులో తన తప్పును అంగీకరించాడు. ఈ క్రమంలో జైలు నుంచి బయటికి వచ్చిన అతడు శుక్రవారం భార్య ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి, కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై తన సోదరికి డొజాయ్ను చంపిన విషయాన్ని సందేశం ద్వారా తెలిపాడు. ఆమె అపార్ట్‌మెంట్‌కు చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న డొజాయ్ను చూసింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలోనే దినేశ్వర్ కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హృతిక్ రోషన్‌ను ఇష్టపడటం వల్లే ఆమెను దినేశ్వర్ హత్య చేశాడని డొజాయ్ స్నేహితురాళ్లు ఆరోపించారు. దినేశ్వర్‌కు తన భార్య అంటే పిచ్చని, ఆమె చాలా అందంగా ఉండేదని.. హృతిక్‌పై అసూయతో ఇలా చేశాడని అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
