
తాజా వార్తలు
లఖ్‌నవూ: ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్ ప్రదర్శించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. నోబాల్ అయ్యే బంతిని సంధించకుండా డెడ్‌బాల్‌గా మార్చుకున్న అతడి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. నజీబుల్లా, అఫ్గాన్ భాగస్వామ్యాన్ని తెరదించాలని 25వ ఓవర్ వేయడానికి పొలార్డ్ బంతిని అందుకున్నాడు. లైన్ అవతల తన పాదం మోపి మొదటి బంతిని విసరడానికి అతడు ప్రయత్నించాడు. దీంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీనిని గమనించిన పొలార్డ్ రెప్పపాటు క్షణాల్లోనే బంతిని సంధించడం ఆపేశాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. నోబాల్‌ను డెడ్‌బాల్ మార్చుకున్న అతడి సమయస్ఫూర్తిని చూసి అంపైర్ కూడా మైదానంలో కొద్దిసేపు నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు పొలార్డ్ సమయస్ఫూర్తికి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తో కైవసం చేసుకుంది. లఖ్‌నవూ వేదికగా సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌ను విండీస్ 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట అఫ్గాన్ 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అస్ఘర్ (86), మహమ్మద్ నబీ (50*) అర్ధశతకాలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో కీమో పాల్ (3/44) ఆకట్టుకున్నాడు. షై హోప్ (109*) శతకంతో అదరగొట్టగా విండీస్ 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
