
తాజా వార్తలు
దిల్లీ: రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు చివరకు రాష్ట్రపతి పాలనకు దారితీశాయి. భావసారూప్యత కల్గిన మహాయుతి కూటమి (భాజపా-శివసేన)కు పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ అధికార పంపకాలపై ఏర్పడిన వివాదంతో ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అధిక సీట్లు గెలుచుకున్న భాజపాను గవర్నర్ బీఎస్ కోశ్యారీ తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినప్పటికీ తగిన సంఖ్యాబలం లేక ఆ పార్టీ నిరాకరించింది .ఆ తర్వాత శివసేనను పిలిచినా ఆ పార్టీ మరింత గడువు కోరడంతో గవర్నర్ అందుకు నిరాకరించారు. చివరకు మూడో పెద్ద పార్టీగా నిలిచిన ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. ఈ రోజు రాత్రి 8.30 గంటలలోపు చెప్పాలంటూ డెడ్‌లైన్ కూడా విధించారు. ఇంతలోనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన గవర్నర్ తీరుపై కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీఎస్ కోశ్యారీ అన్ని విధాలా ప్రయత్నించినా ఆ దిశగా సానుకూల ఫలితాలు రాలేదు. ఏ పార్టీకీ సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనే మార్గమనే నిర్ణయానికి గవర్నర్ వచ్చారు. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఎన్సీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం సమకూర్చుకొనేందుకు మూడు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ఏ రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితులు లేవని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మధ్యాహ్నం జరిగిన కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించింది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫారసు చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారన్న విషయం నివేదికలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు, గవర్నర్ నిర్ణయంపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
