
తాజా వార్తలు
ఎందుకో తెలుసా?
హైదరాబాద్: ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా రాణిస్తున్న కథానాయికగా రకుల్‌ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ భామ తొలినాళ్లలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస అవకాశాలు దక్కించుకున్నారు. హిట్లతో అగ్ర కథానాయికల జాబితాలో చేరారు. అయితే కెరీర్ ప్రారంభంలో ఓ మంచి అవకాశాన్ని వదులుకున్నానని రకుల్ ఓ సందర్భంలో అన్నారు. సరైన అవగాహన లేకపోవడంతో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (2011) సినిమాను వదులుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ముందు రకుల్‌నే ఎంపిక చేశారు. కానీ ఎప్పటి నుంచో మిస్ ఇండియా అవ్వాలనే కోరిక ఉన్న రకుల్‌కు చిత్ర పరిశ్రమ గురించి పెద్దగా అవగాహన లేదట. మరోవైపు అప్పటికీ ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. కానీ తండ్రి ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చేందుకు రకుల్ ఓకే చెప్పారు. అలా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రానికి సంతకం చేసి, షూటింగ్లో నాలుగు రోజులు పాల్గొన్నారు. అయినా తన లక్ష్యం మరొకటి కావడం, చిత్ర పరిశ్రమ తనకు సరైన రంగం కాదనుకోవడం వల్ల ఈ చిత్రాన్ని వదిలిపెట్టినట్లు రకుల్ పేర్కొన్నారు. అన్నీ కుదిరి ఉంటే.. ఆమె ‘మిస్టర్ పర్ఫెక్ట్’తోనే టాలీవుడ్‌కి పరిచయమయ్యేవారట. ఆ తర్వాత ఆమె ‘వెంటకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ద్వారా తెరపైకి వచ్చారు.
‘మిస్టర్ పర్ఫెక్ట్’లో కాజల్, తాప్సి కథానాయికలుగా నటించారు. కె. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం విజయం సాధించడంతోపాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.