
తాజా వార్తలు
హైదరాబాద్: కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో గాయపడిన లోకో పైలట్ చంద్రశేఖర్ కన్నుమూశారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 11న ఉదయం ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాదంలో లోకో పైలట్ చంద్రశేఖర్ సహా 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కేబిన్‌లో ఇరుక్కుపోయిన చంద్రశేఖర్‌ను దాదాపు 8 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కాలులోని రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడంతో రక్త ప్రసరణ నిలిచిపోయింది. దీంతో ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించే ప్రమాదం ఉండటంతో మరో దారి లేక శస్త్రచికిత్స చేసి కుడి కాలును మోకాలు వరకు తొలగించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రశేఖర్ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- ఉతికి ఆరేశారు
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
