
తాజా వార్తలు
ఇండోర్: భారత్ బౌలింగ్ దళాన్ని చూసి బంగ్లా బౌలర్లు ఎంతో నేర్చుకోవచ్చని బంగ్లా సారథి మొమినుల్ హక్ అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టెస్టు ఫార్మాట్ జట్టుపై కసరత్తులు చేస్తామని తెలిపాడు. ‘కోచ్‌తో కలిసి టెస్టు ప్రణాళికను సిద్ధం చేస్తాం. జట్టు కూర్పుపై కసరత్తులు చేయాల్సి ఉంది. ఫలితాలు వెంటనే లభించవు. కానీ, మూడేళ్లలో మంచి జట్టుగా తయారవుతాం. గత ఏడు నెలల్లో మేము రెండు టెస్టులే ఆడాం. ఇతర జట్టులతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. సుదీర్ఘ ఫార్మాట్లో ఆకట్టుకోకపోవడానికి ఇదో కారణం. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉంది. దీనివల్ల టెస్టులు ఆడటానికి మాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. భారత బౌలింగ్ దళం నుంచి మా పేసర్లు ఎంతో నేర్చుకోవచ్చు. పాత బంతి, కొత్త బంతితో ఎలా రాణించాలో తెలుసుకోవచ్చు. టీమ్ఇండియా గొప్పగా ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సాహసోపేత నిర్ణయమే. సారథి బాధ్యతలపై నేను దిగులు చెందట్లేదు. ఆటలో ఇదో భాగం. శ్రమిస్తే విజయం తప్పకుండా దక్కుతుంది. గులాబీ బంతితో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాం’ అని అన్నాడు.
ఇండోర్ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా బౌలర్ల ధాటికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే కుప్పకూలింది. ద్విశతకంతో రాణించిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టు కోల్‌కతా వేదికగా నవంబర్ 22న ప్రారంభం కానుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
