
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: సౌదీఅరేబియా ప్రభుత్వరంగానికి చెందిన అరాంకో విలువను 1.71ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టే అవకాశం ఉంది. 2016 సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్దేశించిన 2ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కంటే తక్కువ కావడం గమనార్హం. ఐపీవోలో మూడోవంతు షేర్లను సౌదీలోని పెట్టుబడిదారులకే కేటాయించనుండటం విశేషం. ఈ ఐపీవోలో కంపెనీలో దాదాపు 1.5శాతం వాటాలను విక్రయించి కనీసం 24 బిలియన్ డాలర్లు సేకరించాలని భావిస్తోంది. గతంలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ఐపీవో 25 బిలియన్ డాలర్లను సేకరించి రికార్డు సృష్టించింది. అరాంకో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
డిసెంబర్ ఐదోతేదీన కంపెనీ పూర్తివిలువను వెల్లడించనున్నారు. మరోపక్క బ్లూమ్‌బెర్గ్ సంస్థ 24 మనీమేనేజ్‌మెంట్ సంస్థల నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం 1.2ట్రిలియన్ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్ డాలర్ల మధ్యలో దీనివిలువను నిర్దారించవచ్చని తెలుస్తోంది.
మరోపక్క ఆదివారం ఇన్వెస్టర్ రోడ్‌షోను కంపెనీ సీఈవో అమిన్ నాసిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదో చారిత్రకమైన రోజు అని అన్నారు. మరోపక్క ఈ ఐపీవోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీకి చెందిన సంపన్నులు ఒలాయన్ కుటుంబీకులు, అల్వాలీద్ యోచిస్తున్నట్టు సమాచారం. అల్వాలీద్ను 2017లో రిట్జ్కార్లటన్ హోటల్లో బంధించారు. చైనా కూడా ఈ ఐపీవోలో దాదాపు 10 బిలియన్ డాలర్లను సావరీన్ వెల్త్ఫండ్లో పెట్టుబడి పెట్టేఅవకాశాలు మొండుగా ఉన్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
