
తాజా వార్తలు
వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్
దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం విక్రయం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి కావచ్చు.’’ అని నిర్మల తెలిపారు. ఎయిర్ ఇండియాకు మార్చి నెలాఖరు నాటికి సుమారు రూ.58 వేల కోట్ల మేర అప్పులు ఉన్న సంగతి తెలిసిందే.
ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని గతేడాది మార్చిలోనే ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అప్పుల బారిన పడ్డ సంస్థను కాపాడేందుకు ఐదేళ్లు సమయం ఇవ్వాలన్న పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫారసును విస్మరించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిపాదిత అమ్మకం విఫలమైంది.
అయితే, ఎయిర్ ఇండియాను 100 శాతం ప్రైవేటుపరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గత ఆగస్టులో ప్రకటించారు. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకొనేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన అన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఖర్చులో రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఇంధన ధరలు పెరగడం, విదేశీ సర్వీసుల్లో నష్టాలు ఇందుకు కారణమని వెల్లడించింది. అయితే, 2019-20 ఏడాదిలో సంస్థ నిర్వహణపరమైన నష్టాల నుంచి బయటపడే అవకాశముందని సీనియర్ అధికారులు గతంలో వెల్లడించారు.
భారత్ పెట్రోలియంలోనూ ప్రభుత్వానికున్న 53.29 శాతం వాటాను విక్రయించేందుకు సంస్థ సెక్రటరీల బృందం అక్టోబరులోనే అంగీకరించింది. ఈ సంస్థ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1.02 లక్షల కోట్లు కాగా, ప్రభుత్వ వాటా 53.29 శాతం సుమారు రూ.65 వేల కోట్ల విలువ చేయనుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
