
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: మూడేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ నిర్వహించిన మెరుపుదాడుల్లో 100 మంది సైనికులకు నూతన అనుభూతులు మిగిల్చాయి. చిమ్మచీకట్లో కూడా లక్ష్యాన్ని చూసి గుర్తించేలా థర్మోబారిక్ రాకెట్స్, గ్రనేడ్ లాంఛర్లు, రైఫిళ్లపై అమర్చిన ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్స్ మన సైనికులకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చాయి. అంతకుమించి.. ఎంత రాత్రివేళైనా శత్రువుల అంతుచూడొచ్చు అనే ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. ఫలితంగా ఆరు ఉగ్రవాద శిక్షణా శిబిరాలను మన సైనికులు భస్మీపటలం చేసొచ్చారు. ఈ మొత్తం ఆపరేషన్‌ను డ్రోన్ల సాయంతో లైవ్కెమేరాలు బంధించాయి. కొన్నాళ్ల క్రితం దీనికి సంబంధించిన స్వల్ప ఫుటేజీ మీడియాలో వైరల్ కూడా అయింది. ఈ విజయంలో మన సైన్యం వ్యూహం.. ప్రభుత్వం తెగువ.. మరో సంస్థ కృషి కూడా ఉంది. అది అరవింద్ లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలోని బెంగళూరుకు చెందిన స్టార్టప్ టాంబోస్ ఇమేజింగ్ సెన్సర్స్. అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు.
విచిత్ర ఘటనతో సైన్యం దృష్టికి..
టాంబో రాత్రివేళల్లో చూసే పరికరాలను తయారు చేస్తుంది. వీటిని ఉపయోగించి కిలోమీటర్ దూరంలోని వాస్తవ పరిస్థితిని అంచనావేసి దళాలు నిర్ణయం తీసుకొంటాయి. పైగా ఈ సంస్థ తయారు చేసే స్మార్ట్కెమేరాలు ఆపరేషన్‌ను లైవ్‌లో చిత్రీకరించి వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థద్వారా బేస్‌కు పంపిస్తాయి. భారత్‌లో ఎప్పటి నుంచో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా మన భద్రతా దళాల దృష్టికి రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం నాటోతో కలిసి మన భద్రతా దళాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అప్పుడే తమ బలగాలు ఉపయోగించిన నైట్‌విజన్ పరికరాలు బెంగళూరులోని ఒక ఇంజినీరింగ్ సెంటర్లో కొనుగోలు చేశామని అమెరికా సైనికాధికారులు చెప్పారు. దీంతో మన అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో సైనికాధికారులు బెంగళూరులోని లక్ష్మణ్‌కుమార్ వద్దకు వచ్చారు. అప్పటికే ఆయన వద్ద నుంచి అమెరికా, ఇజ్రాయిల్ వంటి ఐదు దేశాలు పరికరాలను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ 25దేశాలకు పరికరాలను విక్రయిస్తోంది. ఈ పరికరాలను ఆయా దేశాల స్మార్ట్ ఆయుధాల్లో అమరుస్తున్నారు.
టాంబో ఇటీవల లూధియానాలో అభివృద్ధికేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే దీనికి భారత్, అమెరికా, సింగపూర్‌లో ఇటువంటి కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో స్వతంత్రంగా ప్రయాణించే రోబో వాహనాలను అభివృద్ధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇన్వెస్టర్లు ఈ స్టార్టప్‌లో రూ.200 కోట్ల పెట్టుబడులను పెట్టారు.
సైన్యం కష్టాలు తెలిసిన విద్యావంతుడు..
లక్ష్మణ్ కుమార్ మంచి చదువరి. ఆయన బెంగళూరులోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకొన్నారు. ఆయనకు సైనికుల ఇబ్బందులు తెలుసు. దళాలు రాత్రివేళల్లో చూడటానికి పడే ఇబ్బందులపై ఆయనకు అవగాహన ఉంది. చాలా మంది అధికారులు సొంతడబ్బుతో తొలుత పరికరాలను కొని ఆ తర్వాత వాటిని రీఫండ్ చేసుకొన్న ఘటనలను కూడా చూశారు. అనంతరం ఆయన అమెరికాలోని కార్నిగో మెలన్ యూనివర్శిటీలోని రోబోటిక్ ఇన్స్టిట్యూట్ నుంచి పీహెచ్డీ అందుకొన్నారు. ఆయనకు పీహెచ్‌డీలో మార్గదర్శిగా వ్యవహరించిన టకియో కనాడే కంప్యూటర్ విజన్‌ను కనుగొన్న అతికొద్ది మందిలో ఒకరు. ఈక్రమంలో 2000లో లక్ష్మణ్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చి ప్రాజెక్ట్స్ ఏజెన్సీలో నిఘావీడియోలపై పనిచేశారు. అనంతరం 2003లో భారత్‌కు తిరిగి వచ్చారు. భారత్‌లోని సర్నూఫ్ టెక్నాలజీస్ అధిపతిగా పనిచేశారు. ఈసంస్థ స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థలో పనిచేస్తున్న 600 మంది వివిధ రంగాల్లో డాక్టరేట్లు చేసినవారే. ఇది అమెరికా రక్షణశాఖలోని ఇమేజింగ్ వ్యవస్థలపై పనిచేసింది. 2007లో ఈ కంపెనీ దెబ్బతినడంతో మరో భాగస్వామితో కలిసి దీనిని లక్ష్మణ్ కొనుగోలు చేశారు. 2012లో దీనిపేరు టాంబో ఇమేజింగ్ మార్చారు. టాంగో అంటే జపాన్ భాషలో దీనిని డ్రాగన్‌ఫ్లై అని అర్ధం. ఇది అద్భుతంగా చూడగలదు. అలానే టాంగో పరికరాలు కూడా వివిధ సెన్సర్ల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి చిత్రంగా రూపొందిస్తుంది. కనాడే గౌరవార్థం ఈ పేరు పెట్టారు.
‘‘చాలా దేశాలు ఆధునిక ఆయుధాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆధునిక యుద్ధపరికరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ట్యాంక్‌లు, రైఫిల్స్‌లో కంప్యూటర్ విజన్ ఫీచర్ ధరే 30శాతం వరకు ఉంటోంది. ’’ అని లక్ష్మణ్ వెల్లడించారు. వాస్తవానికి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇటువంటి స్టార్టప్‌లు కీలకంగా మారాయి. ఈ స్టార్టప్‌లకు ఆర్డర్లలు లభిస్తే ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకొని కాంట్రాక్టు పద్దతిలో తయారీని విస్తృతం చేసి చౌక ధరలకే అందుబాటులోకి తీసుకురావచ్చు. టాంబో ప్రస్తుతం జోర్డాన్ సైన్యానికి ఇమేజింగ్ సిస్టమ్స్‌ను తయారు చేస్తోంది. యూరప్‌కు చెందిన థేల్స్ వంటి దిగ్గజ సంస్థలను బిడ్డింగ్‌లో ఓడించి ఈ కాంట్రాక్టును దక్కించుకోవడం విశేషం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
