
తాజా వార్తలు
అది వాస్తవం కాదు: ఈషా రెబ్బా
హైదరాబాద్: ‘రాగల 24 గంటల్లో’ సినిమాలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డానని కథానాయిక ఈషా రెబ్బా తెలిపారు. ఆమె, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ నవహాస్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. నవంబరు 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
బాధ్యత నాపై పడింది
‘ఇలాంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఈ తరహా చిత్రం చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఆ కల ఇప్పటికి నెరవేరినందుకు సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ. ఇందులో నా పేరు విద్య. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. ఎందుకంటే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రం కాబట్టి బాధ్యత మొత్తం నా భుజాలపైనే పడింది. కథ నా చుట్టూనే తిరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ రోజులు షూటింగ్లో పాల్గొన్నా. నా పాత్రలో కోపం, బాధ, భయం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటిని పలికించడం కోసం మానసికంగా శ్రమ పడాల్సి వచ్చింది’.
ఊహించలేరు
‘శ్రీనివాస్ సర్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన ‘ఢమరుకం’ తీశారని మాత్రమే నాకు తెలుసు. ఆయన ఎక్కువ కామెడీ జోనర్లు చేశారని తర్వాత తెలిసింది. దర్శకుడిగా ఆయనకిది తొలి థ్రిల్లర్ అయినప్పటికీ ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. కథలో ఉన్న మలుపులను ప్రేక్షకులెవ్వరూ ముందుగా ఊహించలేరు. చాలా ట్విస్ట్‌లు, సర్ప్రైజ్లు ఉన్నాయి. నాకు ఆయన కథ చెప్పినప్పుడు కూడా తర్వాత ఇలా జరుగుతుందేమో అని అనుకునేదాన్ని. కానీ, నా అంచనాలకు ఎక్కడా దొరికేది కాదు. థ్రిల్లర్లకు ఉండాల్సిన ప్రధాన లక్షణం కూడా అదే. సత్యదేవ్ పాత్ర కూడా చాలా బాగుంటుంది’.
అది వాస్తవం కాదు
‘తెలుగు అమ్మాయి కావడం వల్ల అవకాశాలు తక్కువ వస్తుండొచ్చు కానీ, ఆ ముద్ర నా కెరీర్‌కు ఎప్పుడూ ప్రతికూలాంశం అనుకోలేదు. అవకాశాల కోసం ఈ మధ్య హాట్ ఫొటో షూట్లు చేస్తున్నానేమో అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. నిజానికి నేనెప్పుడూ హాటే. అన్నిరకాల దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంటా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఆశ. ఓ సినిమా ఎంచుకునేటప్పుడు కథ బాగుందా? దర్శకుడికి కథపై మంచి పట్టుందా లేదా? అన్నదే ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. స్టార్ హీరోలతో చేసే అవకాశం వస్తే కాస్త కథ అటు ఇటుగా ఉన్నా ఒకే చెప్పేస్తా. ఎందుకంటే మనకి పేరొస్తుంది కదా (నవ్వుతూ). పరాజయాలకు కుంగిపోయే మనస్తత్వం నాది కాదు’.
సంబంధం లేదు
‘నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్‌సిరీస్ నటిస్తున్నా అనగానే అందరూ.. కియారా నటించిన పాత్ర చేస్తున్నానని అనుకుంటున్నారు. నిజానికి ఆ సిరీస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో కనిపించే నాలుగు కథలు పూర్తిగా కొత్తవే. ఇందులో రెండు పాత్రలకి నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. నేను చేస్తున్న కథకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ఆషిమా నర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే నా భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళంలో జి.వి.ప్రకాష్‌తో ఓ సినిమా చేస్తున్నా. కన్నడలో చేయబోయే కొత్త చిత్రం త్వరలో మొదలవుతుంది. తెలుగులో ఓ కథ వింటున్నా... త్వరలో వివరాలు చెప్తాను’.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
