
తాజా వార్తలు
లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్): మహిళలు వృత్తిపరమైన, వైవాహిక జీవితం రెంటినీ సమర్థంగా నిర్వహించుకోగలరని రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ అన్నారు. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ సైనీతో దిల్లీలో గురువారం ఆమె వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ఆమె లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లితో తన పనికి ఎలాంటి ఆటంకమూ ఉండబోదన్నారు. ‘‘రాయ్‌బరేలీ నా బాధ్యత. పూర్వీకులు ఇక్కడివారే కావడంతో నా మనస్సు ఈ ప్రాంతానికే అంకితం. నాకు పెళ్లయినా ఈ ప్రాంతం అభివృద్ధికి మాత్రం ఎలాంటి ఆటంకం కలగనీయను. కెరీర్, వైవాహిక జీవితాన్ని ఓ మహిళ ఎలా నిర్వహిస్తుందనే ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. ఆ రెంటినీ సమర్థంగా నిర్వహించగల శక్తి మహిళలకు ఉంది. నేనూ నా పనిని కొనసాగిస్తా. మహిళలకు అలాంటి ప్రశ్నలు ఎదురు కానీయకుండా చేయాలి’’ అని అన్నారు.
పంజాబ్‌లోని నవాన్షార్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అంగద్ సింగ్ సైనీతో అదితి సింగ్ వివాహం నిశ్చియమైంది. ఈ నెల 21న వీరిద్దరూ దిల్లీలో పెళ్లిపీటలెక్కనున్నారు. తామిద్దరిదీ ఒకేరకమైన రాజకీయ నేపథ్యం కావడంతో పరస్పరం అర్థంచేసుకునే వీలు ఉంటుందన్నారు. ‘అంగద్ సింగ్ సైనీని పెళ్లి చేసుకోబోతుండటం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరిదీ ఒకే రాజకీయ నేపథ్యం. ఒకరినొకరు బాగా అర్థంచేసుకొని ముందుకెళ్లేందుకు ఇది బాగా ఉపకరిస్తుంది. ఆయన చాలా మంచివారు. నన్ను, నేను చేసే పనిని గౌరవిస్తారు. ఇద్దరు వ్యక్తులు ఒకే పార్టీకి చెందినవారైనా వారి అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు. దాన్ని పట్టుకొని ఒకరిని తప్పుగా అర్థంచేసుకోకూడదు. మా అభిప్రాయాలను పరస్పరం పంచుకుంటాం. అంతేగానీ ఒకరిపై మరొకరం బలవంతంగా అభిప్రాయాల్ని రుద్దుకొనే ప్రయత్నం చేయం’’ అని అన్నారు.
అదితి సింగ్‌కు ఇటీవల కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీచేసింది. అక్టోబర్ 2న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించగా.. అదితి హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ పార్టీ నాయకత్వం ఆమెకు నోటీసులివ్వడంతో ఆమెకు తిరుగుబాటు ఎమ్మెల్యేగా ముద్ర పడింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- శ్వేతసౌధంలో ఏకాకి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
