
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారు బటిస్టాని రూపొందించి చరిత్ర సృష్టించిన మహీంద్రా అనుబంధ ఇటలీ కంపెనీ పినిన్‌ఫరినా మరో సరికొత్త కారును మార్కెట్లోకి తేనుంది. దీనికి పీఎఫ్1గా నామకరణం చేశారు. నిజానికి దీనికి సంబంధించిన డిజైన్ని బటిస్టా ఆవిష్కరణ కార్యక్రమంలోనే చూపించినప్పటికీ.. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇదే కోవకు చెందిన మరో ఐదు సరికొత్త కార్లను కూడా భవిష్యత్తులో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. లంబోర్గిని ఉరుస్, పోర్షే పనమెరా షూటింగ్ బ్రేక్, ఫెరారీ జీటీసీ4 తరహాలోనే పీఎఫ్1 కూడా అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని కానీ, ఇది మాత్రం పూర్తిగా విద్యుత్తు వాహనం అని సంస్థ సీఈఓ మైఖేల్ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పీఎఫ్1లో నాలుగు సీట్లు ఉంటాయని తెలిపారు. పనితీరు, డిజైన్‌లో ఈ కారు అత్యంత మెరుగ్గా, నాణ్యతగా ఉంటుందన్నారు. బటిస్టా కంటే కాస్త ఎత్తుగా, పొడుగ్గా ఉంటుందన్నారు.
ఇక ఇంటీరియర్‌లో 90శాతం మేర ప్రత్యేకమైన మెటీరియల్ వాడతున్నామని.. ప్లాస్టిక్ వినియోగం చాలా తక్కువగా ఉంటుందని మైఖేల్ తెలిపారు. అలాగే డ్యాష్‌బోర్డులో 90శాతం చెక్కనే వాడుతున్నామన్నారు. ఇది తొలి సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ యుటిలిటీ వెహికల్ (ఎస్-ఎల్‌యూవీ) అని తెలిపారు. తక్కువ ఎత్తులో ఉండే బానెట్, పెద్ద ఫెండర్, పూర్తిగా గ్లాస్ కప్పుతో పీఎఫ్1 రాబోతుందని వెల్లడించారు. పరిమాణంలో ఐదు మీటర్ల పొడవు, రెండు మీటర్ల ఎత్తు ఉంటుందన్నారు. బరువును బ్యాలెన్స్ చేసేలా వెనుకభాగంలో రెండు ముందు భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయన్నారు. ఇవి 1000బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తాయన్నారు. సంవత్సరానికి దాదాపు 1500యూనిట్లను ఉత్పత్తి చేసే అకవాశం ఉందని తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
