
తాజా వార్తలు
ఆసక్తి రేకెత్తిస్తున్న తాజా పరిణామం
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. అక్కడ పరిస్థితుల్లో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకై కాంగ్రెస్-ఎన్సీపీ నేడు సమావేశం కానున్న తరుణంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేడు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:30గంటలకు వీరిద్దరి భేటీ జరగనుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం లభిస్తోంది.
మహారాష్ట్రలోని రైతుల సమస్యలపై ప్రధాని మోదీతో పవార్ చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు ఆవరణలోనే వీరి భేటీ జరగనుంది. శివసేనతో పొత్తు విషయంలో ముందుకు వెళ్లడంపై ఈరోజు సాయంత్రం కాంగ్రెస్-ఎన్సీపీలు మరోకీలక భేటీ నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలంటూ మోదీతో పవార్ భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య మహారాష్ట్ర రాజకీయ పరిస్థితి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- గొల్లపూడి తీరని కోరిక..!
- మాది గురుశిష్యుల సంబంధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
