
తాజా వార్తలు
అమరావతి: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవినీతి తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సచివాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. రేషన్, పింఛను, ఆరోగ్యశ్రీ, ఫీజు చెల్లింపు కార్డులన్నీ సచివాలయాలే ఇస్తాయని సీఎం చెప్పారు. లబ్ధిదారులకు ఈ కార్డులన్నీ సక్రమంగా అందాలంటే దానికి సంబంధించిన వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు. లోటుపాట్లకు తావులేకుండా పటిష్ఠంగా రూపొందించాలని సూచించారు. దీంతోపాటు విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ఆలోచించాలని..ఒక్కో సిటీ 10 చ.కి.మీ పరిధిలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా చూస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, విద్యుత్ ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
