
తాజా వార్తలు
ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్: హైకోర్టు సూచన మేరకు కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని ఈయూ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ ఐకాస నేతల కీలకసమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘‘ఆదర్శవంతమైన యజమానిగా కార్మికులను చూస్తారని భావిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది. రెండు వారాల్లోగా కార్మిక న్యాయస్థానంలో సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. దేశ, విదేశాల్లో కూడా టీఎస్ ఆర్టీసీకి ఎంతో గుర్తింపు ఉంది. ఆర్టీసీ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంలో కార్మికులది కీలక పాత్ర. ప్రశాంతవాతావరణంలో ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వం. కేవలం.. హాజరు పట్టికలో, డ్యూటీ చార్టుపై మాత్రమే సంతకాలు చేస్తాం.
అక్టోబరు 4న ఎలాంటి వాతావరణం ఉందో.. అలాంటి వాతావరణ కల్పించాలి. ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈదిశగా ప్రయత్నిస్తాయని విశ్వసిస్తున్నాం. సమ్మె చేసేది పరిస్థితిని చక్కదిద్దేందుకు మాత్రమే. కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు, ఆదేశాలు రాలేదు. మేమే ముందుగా స్పందించి.. ప్రజల కోణం, కార్మికుల కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆంక్షలు లేకుండా పిలిస్తే చర్చలకు వెళ్తాం. సమ్మె కారణంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం’’ అని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
