
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆయన కూడా అందుకు తగిన విధంగానే సినిమాను మలుస్తారు. అందుకే ఆయన జక్కన్న అయ్యారు. ఇక సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకూ దానికి క్రేజ్ తీసుకురావడంలో ఆయనది అందెవేసిన చేయి. ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్ సరసన నటించే కథానాయిక ఎవరన్న సందేహాలకు తెరదించుతూ కథానాయికగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ను తీసుకున్నారు. అంతేకాదు, ప్రతినాయక పాత్రల్లో రే స్టీవెన్సన్, అలీసన్ డూడీలు నటించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడి వెనుక చిత్ర బృందం ఓ స్ట్రాటజీని పాటిస్తున్నట్లు తాజా ప్రకటనలను చూస్తే అర్థమవుతోంది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ విడుదలైన తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారా? అన్న ఆసక్తి అందరిలోనూ మొదలైంది. నవంబరు 18, 2017న ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో కలిసి సోఫోలో కూర్చొన్ని ఉన్న ఫొటో షేర్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. రాజమౌళి.. అదీ ఎన్టీఆర్-రామ్‌చరణ్ మల్టీస్టారర్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇరువురి కథానాయకుల అభిమానులైతే సోషల్‌మీడియా వేదికగా పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా? అని అటు అభిమానులు.. ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. సరిగ్గా మళ్లీ నవంబరు 19, 2018 ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైనట్లు లొకేషన్లో దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్-రామ్‌చరణ్ పాత్రలపై ఎన్నో ఊహాగానాలు.. ఎన్నో గుసగుసలు వాటికి తెరదించుతూ ఏడాది ఈ మార్చిలో పాత్రలను పరిచయం చేశారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్‌లు నటిస్తున్నట్లు చెప్పారు. చెర్రీకి జోడీగా, ఆలియాభట్‌ను తీసుకోగా, ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గారీ జోన్స్‌ను ఎంపిక చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల డైసీ తప్పుకోవడంతో చిత్ర బృందం మళ్లీ కథానాయికను వెతికే పనిలో పడింది. తాజాగా నవంబరు 20, 2019న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఓలివియా మోరిస్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తే, నవంబరు నెలలో 18, 19, 20 ఇలా వరుస తేదీల్లో వీటిని వెల్లడించడం గమనార్హం. ఈ ప్రకటనలన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా? లేక దీని వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా? తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సిందే!
‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- దిశ తల్లిదండ్రులకు ఎన్హెచ్ఆర్సీ పిలుపు
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
