
తాజా వార్తలు
హైదరాబాద్: ‘భయపడేవాడే బేరాలకొస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా..’ అని అంటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన కథానాయకుడి నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలయ్యింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ అదరగొట్టారు. ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి చెప్పిన డైలాగ్ హృదయాలను హత్తుకునేలా ఉంది. అలాగే టీజర్ చివర్లో ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.’ అని మహేశ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్‌రాజ్ చెప్పిన డైలాగ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆర్మీ అధికారి అయిన మహేశ్‌కు కర్నూలులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే! దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
