
తాజా వార్తలు
దిల్లీ : మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం పట్టాలెక్కక ముందే అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దిండోషి నియోజకవర్గానికి చెందిన సురేంద్ర ఇంద్రబహదూర్ అనే ఓటరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పార్టీలు ఫలితాల అనంతరం పొత్తు పెట్టుకోవడం ప్రజలిచ్చిన ఎన్నికల తీర్పును ఓడించడమేనని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు ముందే భాజపా-శివసేన కలిసి ‘మహా యుతి’, ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ‘మహా అఘాడీ’ పేరుతో ఎన్నికల సమరంలో పాల్గొన్నాయని చెప్పారు. ఈ పొత్తులను దృష్టిలో ఉంచుకొనే ఓటర్లు వారికి నచ్చిన కూటమికి ఓటేశారని తెలిపారు.
ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో అధికారం చేపట్టాలని చూస్తోందని, అయితే భాజపాతో కలిసి ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రజలు సేనకు ఓటేశారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ పూంఛి కమిషన్ నివేదికను ప్రస్తావించారు. ఆ ప్రకారం హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న పార్టీలను ఫలితాల అనంతరం ఒకే పార్టీగా పరిగణించాలని కోరారు. గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన, ఎన్సీపీలకు పిలుపునివ్వడం కూడా కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా ఉందన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం ఎస్ఆర్ బొమ్మాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును కూడా పిటిషన్లో పొందుపరిచారు. అందులో ‘గవర్నర్ పూర్తి మెజారిటీ కలిగిన పార్టీ నాయకుడిని లేదా అతిపెద్ద పార్టీని లేదా పార్టీల సమూహాన్ని పిలవాలని’ సూచించారు. అయితే ఈ తీర్పులోనూ ‘రాజకీయ పార్టీ లేదా పార్టీల సమూహాలు’ అని పేర్కొనడం కూడా గందరగోళంగా ఉందని, ఒకరిపై మరొకరు పోటీ చేసిన పార్టీలు కూడా సమూహంగా ఏర్పడొచ్చా అనే విషయంలో స్పష్టతలేదని పిటిషనర్ వివరణ కోరారు.
రాష్ట్రంలో నెలకొన్న శాసన, రాజకీయ శూన్యతను భర్తీ చేసేలా సుప్రీం చర్యలు చేపట్టాలని పిటిషనర్ కోరారు. గవర్నర్ శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్‌లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
