
తాజా వార్తలు
హైదరాబాద్: భాజపా శాసనసభాపక్ష నేతగా పార్టీ తనను గుర్తించటం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ నేను పార్టీలో ఎదగడం కొందరు నాయకులకు ఇష్టం లేదు. లక్ష్మణ్ ఓడిపోవడానికి అధ్యక్ష పదవి కూడా కారణం. పార్టీ పనుల్లో బిజీగా ఉండటం వల్లే నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రోటోకాల్ పాటించటం లేదు. నా నియోజకవర్గానికి వస్తే ..నాకే సమాచారం ఉండదు. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించేవారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్, ధర్మపురి అరవింద్‌తో పాటు డీకే అరుణ కూడా అర్హురాలే. అరవింద్ ఆర్థికంగా బలవంతుడు. యూపీ సీఎం యోగీనే నాకు రాజకీయ మార్గదర్శి. అధ్యక్ష పదవిపై నాకు ఆశ లేదు. హిందూ ధర్మం, గో సంరక్షణే నాకు సంతృప్తి నిస్తాయి. పార్టీలో పెద్ద నాయకులు నా ఓటమికి పని చేస్తే... కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి నన్ను గెలిపించుకున్నారు’’ అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.