close

తాజా వార్తలు

‘డిస్కోరాజా’ వచ్చేశాడు..!

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. వి.ఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. వచ్చే ఏడాది జనవరి 24న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా ‘డిస్కోరాజా’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎటువంటి అనుబంధాలు లేని రవితేజను ఓ ఔషధ ప్రయోగం కోసం కొందరు వ్యక్తులు ఎంచుకున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. టీజర్‌లో రవితేజ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంది. టీజర్‌ విడుదలైన కొంతసేపటిలోనే యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.