close

తాజా వార్తలు

సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...

హైదరాబాద్: ‘‘సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో... సారథి వో వారధి వో మా ఊపిరి కన్న కలవో..’’ అంటూ ఆ కుటుంబం మేజర్‌ అజయ్‌కృష్ణ గురించి పాడుకుంటున్నారు. అంతలా అజయ్‌కృష్ణతో ఉన్న అనుబంధం ఏంటి? ఆ కుటుంబానికి ఆపద వస్తే మేజర్‌ ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే ‘సరిలేరు నీకెవ్వరు’ చూడాల్సిందే. మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం మహేశ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సోమవారం ‘సూర్యుడివో చంద్రుడివో’అంటూ సాగే లిరికల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రీకరణ సందర్భంగా పలు సన్నివేశాలతో రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మహేశ్‌-విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు, సెట్స్‌లో సందడి అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

‘దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన భావాత్మక మెలోడికి రామజోగయ్య శాస్త్రి హృదయానికి హత్తుకునే సాహిత్యం అందించారు. దీన్ని ఎంతో శ్రావ్యంగా పరాక్‌ ఆలపించారు. ఈ కాంబినేషన్‌ పరమానందంగా ఉంది.’’ -అనిల్‌ రావిపూడి, దర్శకుడు

దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన స్వరాలకు రామ జోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. బి.పరాక్‌ ఆలపించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ప్రకాష్‌రాజ్‌, సత్యదేవ్‌, నరేష్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.