close

తాజా వార్తలు

నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు

ప్రియురాలిని హత్య చేసిన నిందితుడి ఆత్మహత్య

జిన్నారం, న్యూస్‌టుడే: ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత మహిళలపై దాడులకు పాల్పడిన నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? వరసగా జరుగుతున్న ఉదంతాలు చూస్తే ఇదే అనుమానం తలెత్తుతోంది. మొన్న సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో భార్య, కుమార్తె సహా నలుగురిపై టర్పంటైన్‌ పోసి సజీవ దహనానికి పాల్పడిన నిందితుడు లక్ష్మీరాజ్యం ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో స్నేహితురాలిని కిరాతకంగా గొంతు కోసి చంపిన కేసులో నిందితుడైన జాదవ్‌ అరవింద్‌(23) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి స్వస్థలం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా వాగాల. తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వినాయక్‌నగర్‌లో ఉంటున్నారు. స్థానికంగా ఉండే పదో తరగతి విద్యార్థినిని ప్రేమించిన అరవింద్‌ ఆమె వేరే యువకుడితో చనువుగా ఉండడాన్ని సహించలేక గతేడాది ఆగస్టు 30న ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అరవింద్‌ నాందేడ్‌లోని ఓ కాలేజీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. దిశ ఉదంతం అనంతరం తనకూ శిక్ష తప్పదేమోనని ఆందోళన చెందిన అతడు సోమవారం ఉదయం హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు గతంలో ఆ అమ్మాయితో దిగిన చిత్రాలు ఫేస్‌బుక్‌లో పెట్టి ‘నీవు లేనిదే నేను లేను బంగారం’ అంటూ పోస్ట్‌ చేశాడు. అదే విషయాన్ని ఒక స్నేహితుడికి ఫోన్‌ చేసి చెప్పాడు.  అంతలోనే ఉదయం 8 గంటల ప్రాంతంలో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కళాశాల నుంచి వారికి ఫోన్‌ వచ్చింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.