close

తాజా వార్తలు

బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు

దేహశుద్ధి చేసిన ప్రయాణికులు


నిందితుడు జగన్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

వేలూరు, న్యూస్‌టుడే: ఓ బస్సులో వెళ్తున్న యువతికి బలవంతంగా తాళి కట్టిన యువకుణ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆంబూరు సమీపంలోని సాండ్రోర్‌ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్‌ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని కళాశాలలో చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడని, ఈ విషయం ఆమెకు చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు ఇటీవల వివాహం నిశ్చమైందని, ఈ విషయం తెలుసుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పాడన్నారు. ఆమె దానికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఉన్నాడని తెలిపారు. మంగళవారం ఉదయం ఆ యువతి ఆంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో బయలుదేరగా అతడు కూడా ఎక్కాడన్నారు. ఓ సీట్లో కూర్చొని ఉన్న ఆమె వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో కట్టాడని చెప్పారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ప్రయాణికులు నిందితుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేసినట్లు వెల్లడించారు. అనంతరం తమకు అప్పగించారని వాణియంబాడి పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.