close

తాజా వార్తలు

ఆనమ్‌ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు

హైదరాబాద్‌: టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా చెల్లెలు ఆనమ్‌ మీర్జా మెహందీ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. తమదైన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌తో ఆమె వివాహం జరగనుంది. త్వరలోనే వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారు. సానియా, అజహరుద్దీన్‌, అసదుద్దీన్‌ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు శుభలేఖను అందజేసిన సంగతి తెలిసిందే. ఆనమ్‌, అసద్‌ ఒక్కటి కాబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అక్టోబర్‌లో వీటిని సానియా మీర్జా ధ్రువీకరించారు.

మెహందీ వేడుకలో కొత్తపెళ్లి కూతురు ధగధగా మెరిసిపోయింది. చిలకపచ్చ రంగు డిజైనర్‌ లెంహంగా, లేత నీలం రంగు ఓణీలో ఆనమ్‌ హొయలు పోయింది. స్వతహాగా ఆమె ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ కావడం గమనార్హం. సానియా సైతం డిజైనర్‌వేర్‌లో తళుక్కుమంది. మెహందీ వేడుకకు సంబంధించిన చిత్రాలను వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘జీవితం సాగిపోతుంటుంది. అద్భుతమనిపించే మధుర క్షణాలు కొన్ని ఉంటాయి. వారం రోజులుగా వాటిని నేను అనుభూతి చెందుతున్నా. మెహందీ వేడుకలో నా చుట్టూ ఉన్న ప్రాణ మిత్రులు, కుటుంబ సభ్యులను చూసి నేనెంత అదృష్టవంతురాలినో తెలుసుకున్నా’ అని ఆనమ్‌ తన ఇన్‌స్టాలో రాసుకున్నారు.





Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.