close

తాజా వార్తలు

ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్‌ కిషోర్‌

పట్నా: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయంలో జేడీయూ వైఖరిపై ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి మండిపడ్డారు. నాలుగేళ్ల క్రితం మనపై నమ్మకం ఉంచి పార్టీకి ఓటేసిన వారి గురించి ఓ సారి పార్టీ నాయకత్వం ఆలోచన చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ట్వీట్‌ చేశారు.

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభలో జేడీయూ అనుకూలంగా ఓటేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో ఆ బిల్లు చర్చకు వచ్చిన నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ ట్వీట్‌ చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసే ముందు 2015లో పార్టీ విజయానికి దోహదపడిన వారి గురించి ఆలోచన చేయాలని కోరారు. ఆ ఎన్నికల్లో ముస్లింలే పెద్ద ఎత్తున పార్టీకి ఓటేసి గెలిపించారని పరోక్షంగా గుర్తుచేశారు. ఒకవిధంగా పార్టీ లౌకికవాద విధానాలకు వ్యతిరేకంగా వెళుతున్నామని అంతకుముందు ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పవన్‌ కె వర్మ సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేయగా.. ఆ పార్టీ బిహార్‌ అధ్యక్షుడు వశిష్ఠ నారాయణ్‌ ఆ వ్యాఖ్యలను వ్యక్తిగత అభిప్రాయాలుగా కొట్టిపారేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.