close

తాజా వార్తలు

పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?

మీడియాలో వచ్చిన కథనాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన కాంగ్రెస్‌ సభ్యుడు 

దిల్లీ: కేరళలోని కోజీకోడ్‌లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన పాస్‌పోర్ట్‌ పుస్తకాల్లో  ‘కమలం చిహ్నం’ ముద్రించినట్లు వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు బుధవారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ విషయమై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు ఎంకే రాఘవన్‌ శూన్య గంటలో లేవనెత్తారు. పాస్‌పోర్ట్‌ అధికారి సంతకం, ముద్ర ఉండే పేజీలో ‘కమలం చిహ్నాన్ని’ ముద్రించినట్లు పత్రిక తన కథనంలో వివరించిందని చెప్పారు. ఈ పాస్‌పోర్ట్‌ పుస్తకాలను ఉపసంహరించుకుని, ఇలా ఎందుకు జరిగిందనే విషయమై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.