close

తాజా వార్తలు

పాక్‌లోనూ గూగుల్‌ టాప్‌-10లో మనోళ్లు

ఇస్లామాబాద్‌ (పాకిస్థాన్‌): అభినందన్‌ వర్థమాన్‌.. ఈ పేరు మన దేశంలో అందరికీ సుపరిచితమే. శత్రు సైనికుల చెరలో ఉన్నా.. వారికి ఏమాత్రం తలవంచకుండా గుండె నిబ్బరంతో నిలిచి యావత్‌ దేశం దృష్టినీ ఆకర్షించారు. అందుకే ఈ ఏడాది గూగుల్‌ మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీ జాబితాలో భారత్‌లో తొలి స్థానం దక్కించుకున్నారు. కేవలం మన దేశంలోనే కాదు పాక్‌ దేశానికి గానూ గూగుల్‌ విడుదల చేసిన మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీ జాబితాలోనూ ఈ వింగ్‌ కమాండర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

ఆయనతో పాటు బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె అయిన ఈ భామ పాకిస్థాన్‌లో  ఆరో స్థానంలో నిలిచారు. త్వరలో సారా.. కార్తిక్‌ ఆర్యన్‌, వరుణ్‌ ధావన్‌తో కలిసి నటించనున్నారు. వీరితో పాటు అద్నాన్‌ సమీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వాస్తవానికి పాకిస్థాన్‌కు చెందిన గాయకుడే అయినప్పటికీ కొన్నేళ్ల క్రితమే ఆయన భారత పౌరసత్వం పొందారు. వీరే కాకుండా బాలీవుడ్‌ సినిమాలు కబీర్‌సింగ్‌, గల్లీ బాయ్‌ కూడా పాక్‌లో ఎక్కువగా వెతికిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.