close

తాజా వార్తలు

షేవ్‌చేసుకోకుండా.. సేవ చేస్తారు

తిరువనంతపురం : గడ్డం పెంచుకోవడం ఇప్పుడొక ఫ్యాషన్‌. సినీతారలు, క్రికెట్‌ వీరుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ గడ్డం పెంచి ట్రెండీగా తయారవుతున్నారు. అయితే గడ్డం పెంచడం వెనుక ఓ సేవా కోణం ఉందని రుజువు చేశారు కేరళకు చెందిన యువత.ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి  ‘నో షేవ్‌ నవంబర్‌ ’ ఉద్యమాన్ని మనదేశంలోనూ ముందుకు తీసుకెళ్తున్నారు. గడ్డం తీసుకోకుండా డబ్బు, ఇతరుల నుంచి సేకరించిన విరాళాలను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది ఈ గడ్డం గ్యాంగ్‌.  

ఎక్కువగా పాశ్యాత్య  దేశాల్లో ఉండే ‘నో షేవ్‌ నవంబర్‌ ఉద్యమం ’  భారత్‌లోనూ ఊపందుకుంది. సామాజిక కార్యక్రమాల కోసం డబ్బులు సేకరించే ఈ వినూత్న ఆలోచనకు కేరళలోని  సంస్థ ప్రచారం కల్పిస్తోంది.  ‘నో షేవ్‌ నవంబర్‌ ఉద్యమం’లో భాగంగా   గడ్డం గ్యాంగ్‌ సామాజిక సేవ చేసేందుకు పూనుకుంది. ఈ సంస్థ యువకులు రూ.4 లక్షల విరాళం సేకరించడం విశేషం. సొసైటీలోని యువకులందరూ క్షవరం, గడ్డం  చేసుకోకుండా మిగిల్చిన డబ్బును సేకరించి పలు రకాల సామాజిక అవసరాల కోసం విరాళంగా ఇస్తారు. ఈ నిధులనే వైద్య సహాయం, పేదలకు గృహ నిర్మాణం, ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలు కోసం, వైద్య శిబిరాలను నిర్వహించడం వంటి వాటికి ఉపయోగిస్తోంది గడ్డం గ్యాంగ్‌ సంస్థ.   మూడు సంవత్సరాల నుంచి  ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాశ్చాత్య దేశాలు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. అక్కడి నుంచే మన దేశానికి ఈ సంప్రదాయం వచ్చింది. ప్రచారంలో భాగంగా అక్కడ నవంబర్‌ నెలలో గడ్డం గీసుకోరు. షేవింగ్‌ చేసుకోకుండా మిగిల్సిన సొమ్మును క్యాన్సర్‌ బాధితులకు విరాళంగా అందిస్తారు. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.