close

తాజా వార్తలు

సానియా మీర్జాతో చరణ్‌ చిందులు

వీడియో షేర్‌ చేసిన ఉపాసన

హైదరాబాద్‌: ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్‌ మీర్జా పెళ్లి వేడుకల్లో కథానాయకుడు రామ్‌ చరణ్‌ సందడి చేశారు. సానియా, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌తో కలిసి చిందేశారు. ఓ గాయని పాట పాడుతుండగా వీరు ముగ్గురు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘రాకింగ్‌ ది డ్యాన్స్‌ ఫ్లోర్‌ అంటే ఇదే’ అని కామెంట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. చరణ్‌, ఫరా ఖాన్‌ స్టెప్పులు అదరగొట్టారని.. సానియా కూడా వారికి ఏ మాత్రం తీసిపోలేదని కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌తో ఆనమ్‌ మీర్జా వివాహం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆనమ్‌, అసద్‌ ఒక్కటి కాబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అక్టోబర్‌లో సానియా మీర్జా ధ్రువీకరించారు.

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.