close

తాజా వార్తలు

రజనీ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉండండి

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దర్బార్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించేశారు. డిసెంబరు 16న సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ ప్రకటించారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండమని అభిమానులతో చెప్పారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తూ తెగ కామెంట్లు చేశారు. మురుగదాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఈ ట్వీట్ చేసిన గంటలో దాదాపు 20 వేల మంది లైక్‌ చేయడం, 6 వేల మంది రీట్వీట్‌ చేయడం విశేషం.

‘దర్బార్‌’లో రజనీకి జంటగా నయనతార నటించారు. నివేదా థామస్‌, సునీల్‌శెట్టి, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత రజనీ దర్శకుడు శివ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.