close

తాజా వార్తలు

కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్‌ పోటీ!

చెన్నై: భారత సారథి విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. ఈ ఏడాదిలో కూడా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిస్తే.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.  అంతేకాదు మూడు సంవత్సరాలుగా.. వరుసగా వన్డేల్లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటికే అతడు మూడు సార్లు (2011, 2017, 2018) ఈ ఘనత సాధించాడు. అయితే కోహ్లీకి టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ (1288 పరుగులు, 23 మ్యాచుల్లో), హిట్‌మ్యాన్ (1232 పరుగులు, 25 మ్యాచుల్లో) ఆసీస్‌ ఆటగాడు ఫించ్ (1141 పరుగులు, 23 మ్యాచుల్లో), వెస్టిండీస్ బ్యాట్స్‌మన్‌ హోప్‌ (1123 పరుగులు, 25 మ్యాచుల్లో) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ, రోహిత్‌  మధ్య 56 పరుగులే అంతరం ఉండటంతో విరాట్‌ ఈ రికార్డు సాధిస్తాడా లేదా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అంతేకాకుండా కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. మూడేళ్లుగా ఏడాదిలో అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల రారాజు నిలుస్తున్నాడు. ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ (2,366 పరుగులు), రోహిత్‌ శర్మ (2,184 పరుగులు), బాబర్‌ అజామ్‌ (1820) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లో కూడా కోహ్లీ చెలరేగితే ఈ రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో భారత్ నేడు తొలి మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.