close

తాజా వార్తలు

యువతిపై సామూహిక అత్యాచారం

చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

మాచర్ల గ్రామీణ, విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: ముగ్గురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది డిసెంబరు 24న ఆమె మండలంలోని ఓ గ్రామంలో శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురవడంతో మాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం బాధితురాలు మృతి చెందింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.