close

తాజా వార్తలు

బాబోయ్‌.. ఎవరీ డ్యాన్సర్‌.. అడ్రస్‌ ప్లీజ్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ‘మైఖేల్‌ జాక్సన్‌’ మూన్‌ వాక్‌ చూశారా? ప్రభుదేవా ‘ముక్కాలా.. ముక్కాబులా’ పాట చూస్తుంటే అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా? అనిపిస్తుంది. ఆ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసే కథానాయకులు మనకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌గా పేరున్న హృతిక్‌ డ్యాన్సులకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. అయితే, అలాంటి హృతిక్‌ ఓ అభిమాని చేసిన టిక్‌ టాక్‌ వీడియోకు ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే, ‘ఎవరీ కుర్రాడు అడ్రస్‌ చెప్పండి’ అని అభిమానులను అడిగేంతగా.. ఇంతకీ ఏమైందంటే.. 

హృతిక్‌ రోషన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి ఇరవై వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని టిక్‌టాక్‌ వీడియో తీసి ట్విటర్‌లో తన అభిమాన హీరో హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్టు చేశాడు. ఆ వీడియో చూసిన హృతిక్‌.. ‘నేను చూసిన గొప్ప స్మూతెస్ట్‌ ఎయిర్‌ వాకర్‌.. ఎవరితను..?’ అంటూ స్వయంగా తన ఖాతా నుంచి ఆ అభిమాని పెట్టిన పోస్టును షేర్‌ చేశారు.

సినిమాలతో బిజీగా ఉండే హృతిక్‌ స్వయంగా ఓ అభిమాని వీడియోను షేర్‌ చేస్తూ.. ‘అతని అడ్రస్‌’ చెప్పండి అని అడగడం ట్విటర్‌ వేదికగా వైరల్‌ అయింది. హృతిక్‌ ఆ వీడియోను షేర్‌ చేయడంతో ఆ డ్యాన్స్‌ చేసిన కుర్రాడిని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు, ఒక అభిమాని వీడియోను హృతిక్‌ షేర్‌ చేయడాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను చూసిన బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ సైతం స్పందించి ‘అసాధారణమైన డ్యాన్స్‌ ’అని మెచ్చుకున్నారంటే ఆ కుర్రాడు ఏ రేంజ్‌లో డ్యాన్స్‌ చేశాడో మీరూ చూడండి.

 

 




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.