close

తాజా వార్తలు

బన్నీ చిత్రం: నాన్‌ బాహుబలి2 రికార్డ్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా నాన్‌ బాహుబలి2 రికార్డ్స్‌ను సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. బన్నీ నటన, డ్యాన్స్‌లతో యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోగా.. త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, స్ర్కీన్‌ప్లేతో మెప్పించాడు. విడుదలైన అన్ని చోట్లా పాజిటీవ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళ్తోంది.

ఇదిలా ఉండగా ‘అల వైకుంఠపురములో..’ సినిమా నైజాం, వైజాగ్, కృష్ణ , వెస్ట్, సీడెడ్, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో నాన్ బాహబలి-2 రికార్డ్స్  క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్‌గా చెప్పవచ్చు. మూడో రోజు షేర్‌కు ఎనిమిది ప్రాంతాలు, నాలుగోరోజు షేర్‌కి ఏడు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించడం విశేషం. ఓవర్సీస్‌లో విడుదలైన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ నంబర్ 1 స్థానంలో దూసుకెళ్తోంది. దీంతో బన్నీ అభిమానులందరూ.. విజిల్స్‌ సరిపోవు అని అంటున్నారు. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.